ETV Bharat / state

మియావాకి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి - కరీంనగర్‌ జిల్లా వార్తలు

శాంతిభద్రతల సంరక్షణే కాదు.. సమాజ సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తామని కరీంనగర్ పోలీసులు నిరూపిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌ పోలీసు శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన మియావాకి హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Minister who started the program in Miyawaki at karimnagar
మియావాకి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
author img

By

Published : Feb 3, 2020, 2:32 PM IST

కరీంనగర్‌ పోలీసు శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన మియావాకి హరితహారం కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, సీపీ కమలాసన్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. పోలీసుశాఖ కార్యక్రమాలను మంత్రి, మేయర్‌ ప్రశంసించారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీ కమలాసన్‌రెడ్డి వినూత్నకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.

ఒక్కో సీసీ కెమెరా 40 మంది పోలీసులతో సమానమన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రజల్లో స్పూర్తిని నెలకొల్పారని తెలిపారు. సీపీ సూచించిన మార్గంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లు ముందుకు సాగితే ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటారని వెల్లడించారు.

మియావాకి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

ఇదీ చూడండి : జంపన్నవాగులో మంత్రి సత్యవతి పుణ్యస్నానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.