ETV Bharat / state

Harish rao campaign: 'ధరలు పెంచినందుకు భాజపాకు ఓటు వేయాలా..?' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థి గెల్లుశ్రీనివాస్ యాదవ్ తరఫున మంత్రి హరీశ్ ప్రచారం(Harish rao campaign) చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

Harish rao campaign, huzurabad by election 2021
హరీశ్ రావు ప్రచారం, హుజూరాబాద్ ఉపఎన్నిక 2021
author img

By

Published : Oct 11, 2021, 1:05 PM IST

Updated : Oct 11, 2021, 2:12 PM IST

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెంచినందుకు హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో భాజపాకు ఓటు వేయాలా అని మంత్రి హరీశ్‌ రావు(Harish rao campaign) ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. తెరాస సర్కార్‌(TRS government) చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్​ను గెలిపించాలి. మాకు ఉన్నది రెండేళ్ల సమయమే. నేను 5వేల డబుల్ బెడ్​రూం ఇళ్లు మంజూరు చేయించి... ఎవరి ఇంటి అడుగు జాగాలో వారికి ఇల్లు కట్టుకునేలా ఇప్పిస్తా. కచ్చితంగా ఇప్పిస్తా. మేం ఒకవేళ మాటతప్పితే రెండేళ్ల తర్వాత మళ్లీ మీ దగ్గరకే రావాలి కదా. ఎంతదూరం పోతం మేం. ఇప్పుడు ఆరుసార్లు చూసిన్రు ఈటల రాజేందర్​ను. ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చిన్రు. ఒక్క ఛాన్స్ గెల్లు శ్రీనుకు ఇవ్వండి. కేసీఆర్ ఆశీస్సులు ఉన్నయ్. నేను తోడుగా ఉంటా. నేను నిలబడి గెల్లు శ్రీనుతోటి మీ ఇళ్లు కట్టిస్తా. ప్రతిమంత్రి వంద ఎక్కువో.. తక్కువనో కట్టిన్రు. ఒక్కఇల్లు కూడా కట్టని మంత్రి ఈటల రాజేందర్.

-మంత్రి హరీశ్ రావు

భాజపా ప్రభుత్వం వచ్చాకా నిత్యావసరాల ధరలు అమాంతంగా పెరిగాయని మంత్రి ఆరోపించారు. కరోనా కాలంలోనూ తెరాస ప్రభుత్వం రుణమాఫీ చేసిందని మంత్రి తెలిపారు. వచ్చే ఉగాది వరకు రూ.50 వేల నుంచి లక్షదాకా ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు.

నేనుమన్నా అబద్ధం చెప్పిన్నా.. డీజిల్ ధర పెరగలేదా? గ్యాస్ సిలిండర్ ధర పెంచలేదా? పెట్రోల్ ధర పెరగలేదా? మంచినూనె ధర పెరగలేదా? అంటే ధరలు పెంచినా... మనం పువ్వు గుర్తుకు ఓటేస్తామా? రైతులకు లక్ష రూపాయలు మాఫీ చేస్తామని మాట ఇచ్చాం. కరోనా వచ్చినా వెనక్కి పోలే. పోయినఏడాది రూ.25వేల దాకా చేసినం. ఈ ఏడాది రూ.50వేల వరకు అప్పు ఉన్నవాళ్లకు ఇప్పుడు మాఫీ అయినయ్. రూ.50 వేల నుంచి రూ.లక్షదాకా ఉన్నోళ్లకు మిత్తీతో సహా వచ్చే ఉగాది పండుగ తర్వాత కొత్త బడ్జెట్​లో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఉగాది పండుగ తర్వాత ఈ రుణమాఫీని కచ్చితంగా మాఫీ చేసి తీరుతాం.

-మంత్రి హరీశ్ రావు

భాజపాపై మంత్రి హరీశ్ విమర్శలు

ఇవీ చదవండి:

Last Updated : Oct 11, 2021, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.