ETV Bharat / state

HARISH RAO: ఎంపీగా గెలిచి రెండున్నర ఏళ్లుగా ఏం చేశారు?: హరీశ్​ రావు

రైతుబంధు, రైతుబీమా ఇస్తున్న మన ముఖ్యమంత్రి లాగా దేశంలో ఒక్కరైనా ఉన్నారా అని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ఓటేస్తారా.. రైతుల ఊపిరి తీసే పార్టీకి ఓటేస్తారా ప్రజలే నిర్ణయించాలన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్​లోని వెంకటసాయి గార్డెన్‌లో విత్తనోత్పత్తి రైతులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.

Minister harish rao
మంత్రి హరీశ్​ రావు
author img

By

Published : Sep 27, 2021, 9:34 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నికలో రైతు బాంధవులకు ఓటు వేస్తారా లేక రైతుల ఊసురు తీసే పార్టీకి ఓటేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ వెంకటసాయి గార్డెన్‌లో విత్తనోత్పత్తి రైతులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఉపఎన్నిక కోసం దిల్లీ నుంచి కేంద్రమంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రమేనని కొనియాడారు.

కరీంనగర్​ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడైనా ఓ పది రూపాయల పని చేశాడా అని విమర్శించారు. రానున్న ఉప ఎన్నికలో భాజపా నేత ఈటల గెలిస్తే ఏం అభివృద్ధి జరగుతుందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. పని చేసే తెరాస ప్రభుత్వాన్ని గెలిపించుకుని మన పనులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. కేంద్రం రైతులకు ఏం చేసిందో కూడా అందరూ ఆలోచించాలన్నారు. ధరలు పెంచిన సామాన్యులకు మోయలేని భారాన్ని మోపిన భాజపాకు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి హాజరయ్యారు.

ఇయాల రైతుల బాంధవుడు.. రైతు కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క కేసీఆర్, టీఆర్​ఎస్ ప్రభుత్వం మాత్రమే. దిల్లీలో ఉండే కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేస్తుండ్రు. మనం దిల్లీకి పోతే దొరుకుతారా ఈ మంత్రులు. మనం పోతమా. ఇయాల మీరంతా ఓట్లేస్తే ఒక పెద్దాయన బండి సంజయ్​ గారు ఎంపీగా గెలిచినరు. ఆయన రెండున్నర ఏళ్లలో ఎక్కడన్నా ఓ పది రూపాయల పని చేసిండ్రా. మళ్లీ రేపు రాజేందర్ గారు ఏట్ల చేయగలుగుతారు. ఏ రకంగా మన హుజూరాబాద్ అభివృద్ధి జరుగుతది. పని చేసే టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గెలిపించుకుని మన పనులు చక్కబెట్టుకోవాలె. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమాను తెచ్చింది నిజం కాదా. అన్ని పథకాలు ఇచ్చేదేమో టీఆర్​ఎస్, ఓట్లు మాత్రం మనం బీజేపీకి ఎయ్యాల్నా. ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. - హరీశ్​ రావు, రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి

మంత్రి హరీశ్​ రావు

ఇదీ చూడండి: Harish Rao on dalit Bandu: రేషన్​ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దళితబంధు ఇస్తాం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.