ETV Bharat / state

Harishrao in huzurabad campaign: 'కేసీఆర్​ కుడిచేత్తో ఇస్తే.. భాజపా వాళ్లు ఎడమ చేత్తో గుంజుకుంటుర్రు'

author img

By

Published : Oct 7, 2021, 2:21 PM IST

కేంద్ర ప్రభుత్వం రైతులను ముప్పు తిప్పలు పెడుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా(Minister Harish Rao in huzurabad election campaign).... ధర్మరాజుపల్లిలో రోడ్‌షో (harish rao road show) నిర్వహించారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను (gellu srinivas) గెలిపించాలని కోరారు.

Harish Rao in huzurabad election campaign
Harish Rao in huzurabad election campaign: 'కేసీఆర్​ కుడిచేత్తో ఇస్తే.. భాజపా వాళ్లు ఎడమ చేత్తో గుంజుకుంటుర్రు'

'కేసీఆర్​ కుడిచేత్తో ఇస్తే.. భాజపా వాళ్లు ఎడమ చేత్తో గుంజుకుంటుర్రు'

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ ఉపఎన్నికల ప్రచారంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు (Minister Harish Rao in huzurabad election campaign) పాల్గొన్నారు. ధర్మరాజుపల్లిలో నిర్వహించిన రోడ్​షోలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ గెలిపించాలని కోరుతూ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలోనూ... ప్రజల గురించి ఆలోచించి... మంత్రులు ఎమ్మెల్యేల జీతాలు బంద్​ పెట్టి.. ప్రజలను ఆదుకున్న కేసీఆర్​ను గెలిపిస్తారా...? రైతుల నడ్డి విరుస్తున్న భాజపాను గెలిపిస్తారా? ఆలోచించుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యాక... కరెంటు సమస్య, నీటి సమస్య పోయిందా లేదా? ట్రాన్స్​ఫార్మర్లు కాలిపోవడం.. నీళ్ల కోసం బోర్లు తవ్వించే.. పని బంద్​ అయిందా లేదా ఆలోచించాలని సూచించారు. ఆర్థిక సాయం చేసే ప్రభుత్వాన్ని దీవిస్తారా? రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న భాజాపా అభ్యర్థిని గెలిపిస్తారా? ఆలోచించుకోవాలని సూచించారు. పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్న భాజపాకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.

ప్రజలను ఆదుకున్న కేసీఆర్​ను గెలిపిస్తారా...? రైతుల నడ్డి విరుస్తున్న భాజపాను గెలిపిస్తారా? మీరే తెల్చుకోండి. రైతులను ముప్పు తిప్పలుపెట్టే భాజపాను ఓడించాలి. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది. అందుకే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించండి. హుజూరాబాద్​ ఇంకా అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్​ కుడిచెత్తో ఇస్తే.. భాజపా వాళ్లు ఎడమచేత్తో గుంజుకుంటున్నారు.పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్న భాజపాకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.

- హుజూరాబాద్​ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్​ రావు వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.