ETV Bharat / state

HARISH RAO ON BJP: మన బొగ్గు తరలించేందుకు కేంద్రం కుట్ర: హరీశ్​ రావు - భాజపాపై హరీశ్ రావు విమర్శలు

హుజూరాబాద్‌ ఉపఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల విమర్శల వేడి మరింత పెరిగింది. దళిత బంధును ఈనెల 30 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నిలిపేయడంతో.. తెరాస, భాజపాల మధ్య మాటలయుద్ధం తీవ్రరూపు దాల్చింది. దళితబంధును తాత్కాలికంగా నిలిపేసిన భాజపా నేతలు శునకానందం పొందుతున్నారని ఆర్థికశాఖమంత్రి హరీశ్​ రావు విమర్శించారు. జమ్మికుంటలో ప్రచారంలో భాగంగా పలువురు కాంగ్రెస్, భాజపా కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

minister Harish Rao comments on bjp
జమ్మికుంటలో ప్రచారంలో హరీశ్ రావు
author img

By

Published : Oct 19, 2021, 10:47 PM IST

లేఖలు రాసి పది రోజులు దళిత బంధును ఆపేసిన భాజపా నాయకులు శునకానందం పొందుతున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దళిత బంధును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి భాజపానే కారణమని విమర్శించారు. జమ్మికుంటలో ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పలువురు కాంగ్రెస్, భాజపా కార్యకర్తలను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, భాజపాలు చీకటి ఒప్పందం చేసుకుని... తెరాసను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయని హరీశ్‌ ఆరోపించారు. భాజపా వైఖరిని నిరసిస్తూ హుజూరాబాద్‌ అంబేడ్కర్‌ కూడలి వద్ద ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో.. తెరాస నాయకులు ఆందోళన చేపట్టారు.

తెలంగాణలో నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే భాజపా కుట్రలు పన్నుతోందన్నారు. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. దళిత బంధును నిలిపివేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల కమిషన్​కు లేఖ రాస్తేనే.. ఈనెల 30వ తేదీ వరకు దళిత బంధు నిలిపేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన పథకాన్ని వాళ్లే ఆపాలని లేఖ ఇచ్చి.. దొంగే దొంగ అన్నట్లుగా అరుస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. అందువల్లనే పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు తమను తెలంగాణాలో కలుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుకుంటున్నారని హరీశ్​ రావు పేర్కొన్నారు.

మన పనితీరు బాగుంది కనుక ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రంలో కలుపమంటున్నరు. ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు మనల్ని అడుగుతున్నరు. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నాం కనుక. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లో ఇయాళ కరెంట్ కోతలున్నాయి. ఇతర రాష్ట్రాలోనూ అదే పరిస్థితి ఉంది. దీన్ని సహించలేక భాజపా మన బొగ్గును తరలించేందుకు కుట్ర చేస్తోంది. మన బొగ్గను పక్క రాష్ట్రాలకు తరలించే పార్టీకి మనమెందుకు ఓటెయ్యాలే. దళితబంధును ఆపేమయని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి లేఖ రాశారు. మహా అంటే మీరు పది రోజులు ఆపుతరు. పథకం ఆపేసి శునకానందం పొందుతున్నరు. ఆ తర్వాత సీఎంగా కేసీఆరే ఉంటరు. సంక్షేమశాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ఉంటారు. అప్పుడు దళితబంధు బరాబర్ అమలు చేస్తాం. ఎన్నికల కమిషన్​కు మీరే లేఖలు రాసి దొంగే దొంగ అన్న చందంగా మాట్లడుతున్నరు. ఇప్పుడు గంతా అమాయకులు కాదు మా హుజూరాబాద్ ప్రజలు. హమాలీ సోదరులు కూడా ఇది గమనించాలే. హమాలీల బతుకులను రోడ్డు పడేసేలా భాజపా వ్యవహారశైలి ఉంది. 12 గంటలు పనిచేయాలని కార్మికుల శ్రమను దోపిడీ చేసేలా కేంద్రం చట్టాలు తీసుకొచ్చింది. భాజపా పాలిత రాష్ట్రాల్లో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. - హరీశ్​ రావు, ఆర్థికశాఖమంత్రి

HARISH RAO ON BJP

ఇదీ చూడండి: Mp Arvind Comments: 'కేసీఆర్... దళితబంధు సాధ్యం కాదని నీ ఆఫీసరే చెప్పిండు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.