రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 52వ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో నగర మేయర్ సునీల్‌రావు 52 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం మేయర్ సునీల్‌రావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో 52 మంది కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. వారికి సునీల్‌రావు పండ్లను పంపిణీ చేశారు.
అనంతరం మాతా శిశు కేంద్రం తెరాస విధ్యార్థి విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని గర్భిణీ మహిళలకు పండ్లు, కోడిగుడ్లు, పండ్ల రసం అందజేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్వధార్ హోమ్‌లో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి గంగుల నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని నాయకులు, అభిమానులు కోరుకున్నారు.