ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్కు అన్ని అర్హతలు ఉన్నాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తామని తెలిపారు.
ఐటీ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్‌కు తీసుకువచ్చిన పెట్టుబడులే ఆయన పనితీరుకు నిదర్శనమని మంత్రి గంగుల కమలాకర్ కితాబిచ్చారు. సీఎం అంశం అంతర్గత వ్యవహారం.. భాజపాకి అనవసరమని వ్యాఖ్యానించారు.