ETV Bharat / state

'యాదాద్రి తరహాలో నారసింహుని ఆలయం అభివృద్ధి' - రేకుర్తి నరసింహస్వామి ఆలయం

యాదాద్రి తరహాలో కరీంనగర్ నరసింహస్వామి గుట్టను అభివృద్ధి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. ఈ మేరకు రూ. 3 కోట్లతో గుట్టపై చేపట్టిన రహదారి నిర్మాణ పనులను మంత్రి గంగుల, మేయర్​ సునీల్​రావు పర్యవేక్షించారు.

karimnagar, rekurthi narasimha swamy temple, minister gangula kamalakar
కరీంనగర్​, రేకుర్తి నరసింహస్వామి ఆలయం, మంత్రి గంగుల కమలాకర్​
author img

By

Published : Jan 29, 2021, 3:03 PM IST

కరీంనగర్​ నరసింహ స్వామి గుట్టను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాలోని రేకుర్తి నరసింహస్వామి గుట్టపై రూ. 3 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఆ పనులను మంత్రితో పాటు నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు పర్యవేక్షించారు. నరసింహ స్వామి విగ్రహంపై శంఖు చక్రాలు ఉన్నాయని.. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదని మంత్రి తెలిపారు.

ఈ ఆలయానికి 3 వేల సంవత్సరాల చరిత్ర ఉందని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: 'పురాతన కోట... సుందరపార్కుగా మారింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.