ETV Bharat / state

కేసీఆర్​ జననం.. తెలంగాణ ప్రజలకు వరం: గంగుల

సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలను కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్​ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గడ్డపై కేసీఆర్​ జన్మించడం.. ఇక్కడి ప్రజల అదృష్టమని గంగుల కొనియాడారు.

cm klcr birthday, minister gangula kamalakar
మంత్రి గంగుల కమలాకర్​, కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Feb 17, 2021, 3:35 PM IST

తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు తనకు పండుగ రోజని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై ఆయన జన్మించడం ప్రజల అదృష్టమని కొనియాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో మేయర్ సునీల్‌రావుతో కలిసి.. కేసీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్ కట్‌ చేశారు.

కారణజన్ముడు

కులమతాలకు అతీతంగా కేసీఆర్​ పుట్టినరోజును ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకోవాల్సిన రోజని గంగుల అన్నారు. అందువల్లనే తాను కొత్త బట్టలు కుట్టించుకున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్​ కారణజన్ముడని.. తెలంగాణలో ఆయన పుట్టడం.. ఆ గడ్డపైనే తాను పుట్టడం తన పూర్వ జన్మ సుకృతమని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే బీడుభూములన్నీ సస్యశ్యామలం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. అనంతరం అందరికీ మొక్కలు పంపిణీ చేశారు.

కేసీఆర్​ జననం.. తెలంగాణ ప్రజలకు వరం: గంగుల

ఇదీ చదవండి: వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.