ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి చెరువు వద్ద గణనాథుల నిమజ్జన ఏర్పాట్లను మేయర్ సునీల్ రావుతో కలిసి పరిశీలించారు.
కొత్తపల్లి చెరువు, మానకొండూర్ చెరువు, చింతకుంటలో నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. నిర్వాహకులు, అధికారులు, పోలీసుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని ఆయన కోరారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలలోపు నిమజ్జనం పూర్తి కావాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష