కరీంనగర్లో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు వీలుగా డీఆర్ఎఫ్ బృందాన్ని ప్రారంభించినట్లు బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో విపత్తు నిర్వాహణ విభాగానికి చెందిన వాహనాలను మేయర్ వై.సునిల్ రావు, జిల్లా కలెక్టర్ కె.శశాంక, సీపీ కమలాసన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్లోనే డీఆర్ఎఫ్ బృందం ప్రారంభమైందని మంత్రి తెలిపారు. వీరి సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు.