ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న విషయం హుజూర్నగర్ ఫలితమే రుజువు చేసిందని సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరయ్యారు. తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు తమ మనసుల్లో పెట్టుకున్నారని గంగుల తెలిపారు. విపక్షాలు ఎన్ని రకాల విష ప్రచారం చేసినా ప్రజలు మాత్రం తెరాసను ఆశీర్వదించారన్నారు.
తెరాసకు ప్రజలే యజమానులని పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంత్రికి తెలిపారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి