కరీంనగర్ కలెక్టరేట్లో ఆర్అండ్బీ అధికారులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్మాణంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి, నారదాసు లక్ష్మణ్ నివాస ప్రాంతం నుంచి బస్టాండ్ వరకు నిర్మించ తలపెట్టిన రోడ్డు అంశాన్ని ప్రస్తావించారు. రహదారి నిర్మాణం జరగక పోవడం వల్ల ప్రజల్లో నవ్వులపాలవుతున్నామని మంత్రి గంగుల అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః కలెక్టర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష