కరీంనగర్‌లో కరోనా వైరస్ విస్తరించకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకుగాను ఇంటింటా సర్వే తొలి రోజు విజయవంతంగా పూర్తి చేశామని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో నగర మున్సిపల్ కమిషనర్ క్రాంతితో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
100 బృందాలతో 6,126 ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా... ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదని మంత్రి వెల్లడించారు. కొందరు ఇళ్లలో సర్వేకు అంగీకరించడం లేదని... ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్క్రీనింగ్‌కు సహకరించాలని మంత్రి కమలాకర్ సూచించారు.
కరోనా లక్షణాలు లేకపోయినా ట్రావెల్ హిస్టరీ ఉన్న 20 మందిని మాత్రం ఇళ్లకే పరిమితం కావాలని కోరినట్లు వెల్లడించారు. నగరంలోని 60డివిజన్లలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయిస్తామని మంత్రి వివరించారు.
ఇవీ చూడండి: వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలి: సీఎం