ETV Bharat / state

భవిష్యత్‌ కార్యాచరణపై సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటా :ఈటల - భవిష్యత్‌ కార్యచరణపై ఈటల సమావేశం

భవిష్యత్‌ కార్యాచరణపై సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులతో చర్చించానన్న ఈటల... ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

minister etela, etela latest news today
9 జిల్లాల కార్యకర్తలు వచ్చి పరామర్శించారు:ఈటల
author img

By

Published : May 5, 2021, 1:45 PM IST

Updated : May 5, 2021, 3:34 PM IST

భవిష్యత్‌ కార్యాచరణపై శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులతో చర్చించాను. నన్ను ఈ స్థాయికి తెచ్చినవారి అభిప్రాయాలు తీసుకున్నాను. కరోనా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కొందరు సలహా ఇచ్చారు. మరికొందరు 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలు గుర్తు చేశారు. ఉద్యమానికి ఊపిరినిచ్చిన ప్రాంతం హుజూరాబాద్‌ నియోజకవర్గం. అనేక నియోజకవర్గాల నుంచి వచ్చిన ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారు. నాకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. కరీంనగరే కాదు.. 9 జిల్లాల నుంచి కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా కార్యకర్తలు వచ్చి నన్ను కలిశారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి శ్రేయోభిలాషులతో కూడా చర్చించాల్సి ఉంది.

- ఈటల రాజేందర్​ , మాజీ మంత్రి

ఇదీ చూడండి : బంధాలను బతికించుకునేందుకు తాపత్రయం

Last Updated : May 5, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.