కరీంనగర్ జిల్లాలో భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరపిలేని వానతో రోడ్లన్ని జలమయమయ్యాయి. జిల్లాలో పరిస్థితి పరిశీలించేందుకు కమలాపూర్ మండలంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఉప్పల్, కమలాపూర్ చెరువులను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ విజయతో కలిసి పరిశీలించారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వస్తోన్న వరద తీవ్రత పరిస్థితులను గమనించారు.
వరద నీటితో కొట్టుకపోయిన రోడ్లను పరిశీలించి ముంపు ప్రాంతాలను సందర్శించారు. కాలనీలోని గృహాలను పరిశీలించారు. బాధిత కాలనీవాసులతో మంత్రి ఈటల మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు శంభునిపల్లిలో అలుగుపడిన వాగును పరిశీలించారు. నీటి ఉద్ధృతిని పరిశీలించారు. ముంపు వల్ల ఏ మేరకు నష్టం జరిగిందనే వివరాలను మంత్రి ఆరా తీశారు.
ఇవీ చూడండి : ఉప్పొంగుతున్న గోదావరి... 60 అడుగులకు చేరిన నీటిమట్టం