కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జమ్మికుంటలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా భవన ఆవరణలో మొక్కలు నాటారు. జమ్మికుంట మండలం మాచనపల్లిలో రూ.5లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత పింఛన్ డబ్బులను పెంచుకున్నామని మంత్రి తెలిపారు. కాలంతో పని లేకుండానే పంటలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించున్నట్లు తెలిపారు. ఈ సారి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వనున్నట్లు మంత్రి వివరించారు.
ఇదీ చూడండి:- తప్పతాగి తప్పుడు పనికి యత్నిస్తే ఉతికారేశారు!