ETV Bharat / state

ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో 'నకిలీ డాక్టర్లు' - వారు చెప్పే హెల్త్‌ టిప్స్‌ పాటించారో ప్రాణాలు గాల్లోనే!

అర్హత లేకున్నా డాక్టర్లుగా చలామణి అవుతున్న కేటుగాళ్లు - సోషల్‌ మీడియాలో హెల్త్‌ టిప్స్‌ అంటూ అనర్హుల వీడియోలు - ఈ ఏడాదిలోనే 350 మంది పట్టివేత

Fake Doctors in Telangana
Fake Doctors in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Fake Doctors in Telangana : వారికి ఎలాంటి అర్హతలు ఉండవు కానీ వైద్యం చేస్తారు.. ఎందరో ప్రజల ప్రాణాలను బలికొంటారు. ఇలాంటి వారు ఊరు-వాడలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి వీడియోలు రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. మీరు ఈ డైట్‌ ఫాలో అవ్వండి.. మీకు రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు నయం అవుతాయని. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ల ద్వారా అమాయకులను ఆకర్షిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారు చెప్పిన వాళ్లు పాటించడం సరే.. స్టేటస్‌లు పెట్టి ఇతరులను కూడా అటువైపు మళ్లించి నకిలీ వైద్యుల వలలో పడుతున్నారు.

వీరికి వైద్య పట్టాలు లేకున్నా ఇంగ్లిషు వైద్యం, ఆయుర్వేదం, హోమియో డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఈ విషయాలను స్వయంగా తెలంగాణ వైద్యమండలి వైద్యులు చెబుతున్నారు. ఒకవైపు వాడవాడలా నకిలీ వైద్యులు పుట్టుకోస్తుంటే.. మరోవైపు సోషల్‌ మీడియాలో నకిలీ వైద్యులు కొత్త రకాల మందులను, డైట్లను సూచిస్తూ ప్రజల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు. ఇప్పుడు ఈ అంశం ఆందోళన రేకెత్తిస్తోంది.

పట్టుబడిన 350 నకిలీ వైద్యులు : ధనార్జనే ధ్యేయంగా, మిడిమిడి జ్ఞానంతో నకిలీ వైద్యులు అందిస్తున్న వైద్యానికి పలుచోట్ల గర్భిణులు, పిల్లలు, వయోధికులు సహా పలువురు ప్రాణాలను కోల్పోయారు. ఎలాంటి అర్హత లేకున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో వి.రాంబాబు అనే వ్యక్తి డాక్టర్‌గా చలామణి అవుతున్నాడు. మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు ఈ నకిలీ డాక్టర్‌ను పట్టుకున్నారు.. ఇలా ఈ ఏడాది 350 మందికిపైగా నకిలీ వైద్యులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రజల ప్రాణాలతో చెలగాటం : రాష్ట్ర వైద్య మండలిలో నమోదైన అర్హులైన డాక్టర్లు 70 వేల మంది వరకు ఉండగా.. మరోవైపు వేల సంఖ్యలో అనర్హులు వైద్యం పేరిట ధన వ్యాపారం చేస్తున్నారు. వారు మందుల దుకాణాలతో కుమ్మకై ఇష్టారీతిన ఔషధాలను సిఫార్సు చేస్తున్నారు. దీంతో రోగులు కొత్త రోగాల బారిన పడుతున్నారు. అనారోగ్యంతో వారి వద్దకు వచ్చేవారికి అవసరానికి మించి యాంటీ బయాటిక్స్‌, స్టెరాయిడ్లు, నొప్పి మాత్రలు ఇస్తుండటంతో రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.

నకిలీ డాక్టర్లు.. సొంత క్లినిక్‌లు : కొందరు నకిలీ డాక్టర్లు సొంత క్లినిక్‌లు ఏర్పాటు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇలా హైదరాబాద్‌లోని ఒక్క మల్కాజిగిరిలోనే 10 మంది నకిలీ వైద్యుల గుట్టురట్టయింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కూడా 41 మందిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కూడా వారి స్థాయికి మించి చికిత్సలు చేస్తున్నారు. కొందరు హోమియో, ఆయుర్వేదం వంటి డిగ్రీలు పొంది.. ఇంగ్లిషు వైద్యం చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమే. కొందరు ఆర్‌ఎంపీలు తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక మహిళలను గర్భవిచ్ఛిత్తికి ప్రోత్సహిస్తున్నారు.

ఉదంతాలెన్నో :

  • వికారాబాద్‌ జిల్లాలోని పరిగిలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఓ నకిలీ వైద్యుడు అధిక మోతాదులో ఇంజెక్షన్‌ చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
  • అక్టోబరు నెలలో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించింది. అతడు గర్భవిచ్ఛిత్తి మాత్రలను ఇచ్చాడు. అవి వేసుకున్నాకు మహిళలకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరిన్ని మాత్రలు ఇవ్వగా పరిస్థితి విషమించింది. దీంతో చివరకు వరంగల్‌ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది.
  • మహబూబాబాద్‌ జిల్లా హరిపిరాలలో ఓ బాలికను జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సెలైన్‌ పెట్టి 4 ఇంజెక్షన్లు ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
  • మంచిర్యాల జిల్లాలో పదేళ్ల చిన్నారికి వైరల్‌ జ్వరం రావడంతో తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. హైడోసు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ బాలిక కన్నుమూసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చికిత్స పొందడానికి అర్హులైన వైద్యులనే సంప్రదించాలని రాష్ట్ర వైద్య మండలి వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. అర్హతల్లేని వైద్యులను గుర్తిస్తే antiquackerytsmc@onlinetsmc.in మెయిల్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఎన్‌ఎంసీ చట్టం ప్రకారం అర్హతల్లేకుండా వైద్యం చేస్తే ఏడాది జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ఇది కేసు తీవ్రతను బట్టి పెరుగుతుందని తెలిపారు.

మత్తు ఇంజక్షన్ల 'ఛీ'కటి దందా - ఫెంటనిల్‌ ఇంజక్షన్ల మాఫియా కేసులో సంచలన విషయాలు

Fake Doctors: దొరికితే 'శంకర్‌దాదా'.. దొరక్కుంటే ఎంబీబీఎస్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.