ETV Bharat / state

గాలిపటం రాసిన మరణ శాసనం - కరెంట్​ షాక్​తో బాలుడి దుర్మరణం - ELECTRIC SHOCK IN NIZAMABAD

చెట్టుపైన చిక్కుకుపోయిన గాలిపటం కోసం వెళ్లిన బాలుడి దుర్మరణం - చేతిలోని ఇనుప కడ్డీ కరెంట్​ తీగలకు తగలడంతో సంభవించిన ప్రమాదం

ELECTRIC SHOCK IN NIZAMABAD
మృతి చెందిన బాలుడు షేక్​ మతిన్​ (పాత చిత్రం) (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 4:35 PM IST

A Boy Died With Electric Shock : చిన్నతనంలో ఆడాల్సిన ఆటలు, చేయాల్సిన పనులు ఆ వయస్సులోనే చేయాలి. ఎందుకంటే పెరిగే కొద్ది అవి ఒక్కోక్కటిగా దూరమవుతుంటాయి. ఆ రోజులు మళ్లీ జీవితంలో రానేరావు. అందుకే పిల్లలు ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపేస్తుంటే ఎవరికైనా వారి జీవితం గుర్తుకు వస్తుంటుంది. అల్లరి చేయడం చిన్నతనంలోనే ఉంటుంది. తర్వాత మొదలయ్యే పరుగుల జీవితం, ఎవరికైనా తీవ్రమైన ఒత్తిడితో ఉంటుంది. కానీ ఆ చిన్న చిన్న ఆనందాలు పొందడం కోసం చిన్నారులు చేస్తున్న పనులకు వారి ప్రాణాలు బలి అవుతున్నాయి. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. ఆ తల్లిదండ్రులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురవుతోంది.

నిజామాబాద్​ జిల్లాలోని కుర్నాపల్లి గ్రామంలో షేక్​ మతిన్​ అనే బాలుడు గాలిపటం ఎగరేస్తుంటే అది మెల్లిగా కిందకు దిగుతూ వచ్చినట్టు వచ్చి దగ్గరలోని ఓ చెట్టుపై వాలింది. పతంగి కోసం చెట్టు ఎక్కాలని నిర్ణయానికొచ్చాడు. మెల్లగా చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. గాలిపటాన్ని అందుకునేందుకు ఆసరాగా ఉంటుందని ఓ ఇనుప కడ్డీని వెంట తీసుకొని చెట్టు ఎక్కాడు.

కరెంట్ షాక్ ​: గాలిపటానికి కొంచెం దూరంలో ఉండి దానిని తీయడం ప్రారంభించాడు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా అందలేదు. ఈ ప్రయత్నంలో ఇనుప కడ్డీ పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లపై పడి కరెంట్ సరఫరా అయింది. అంతే షేక్​ మతిన్​కు కరెంట్ షాక్ కొట్టింది. క్షణాల్లోనే ఆ బాలుడు చెట్టుపైనే కొట్టుమిట్టాడుతూ ఊపిరి వదిలాడు. కుర్నాపల్లి గ్రామానికి చెందిన షేక్ మతిన్ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

షేక్​ మతిన్​ మరణ వార్త విన్న గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ వైర్లకు తగిలే విధంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఆ బాలుడి కుటుంబ పరిస్థితి చూస్తే మరింత దయనీయ పరిస్థితి ఉంది. అతని తండ్రి కొన్నేళ్ల కిందట మృతి చెందారు. తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తుంది. దొరికినప్పుడల్లా కూలీ, నాలీ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో ఆ తల్లి ఆర్తనాదాలు చూసి గ్రామస్థులు కంటనీరు పెడుతున్నారు.

ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్​ షాక్ - నలుగురు యువకుల దుర్మరణం - ఎక్కడంటే?

కరెంట్​ షాక్​తో ఇంటరాగేషన్!​- నేరాన్ని ఒప్పుకున్న రష్యా ఉగ్రదాడి నిందితులు - russia attack suspects

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.