కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో నియోజకవర్గస్థాయి సమీక్షా సమవేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో విడివిడిగా సమీక్ష జరిపారు. అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత నిధులు మంజూరయ్యాయి, ఎంత మేరకు పనులు జరిగాయి, జరిగిన పనులు ఎలా జరిగాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొక్కుబడి నివేదికలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. అభివృద్ధి పనులలో జాప్యం చేసే గుత్తేదారులను గుర్తించి వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతామన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులను పరిశీలించాలని ఆదేశించారు. అధికారులు మచ్చ తెచ్చే విధంగా పని చేయకూడదన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు.
ఇవీచూడండి: ఈనెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు