ETV Bharat / state

'హైదరాబాద్​ గడ్డమీద వ్యాక్సిన్​ తయారు కావడం గర్వకారణం' - health minister eetala rajender latest news

ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేసిన కరోనా వైరస్​కు హైదరాబాద్​ గడ్డమీద వ్యాక్సిన్​ తయారు కావడం గర్వకారణమని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. వచ్చే జనవరి కల్లా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని స్థాయిల ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

minister eetala rajender on corona vaccine
'హైదరాబాద్​ గడ్డమీద వ్యాక్సిన్​ తయారు కావడం గర్వకారణం'
author img

By

Published : Dec 8, 2020, 3:59 AM IST

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారు కావటం సంతోషకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ మున్సిపల్‌ కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయభ్రాంతులకు గురి చేసిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌ గడ్డ మీద ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారు కావటం గర్వకారణమన్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఆ వ్యాక్సిన్‌ మొదటగా వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత పోలీసులతోపాటు ఇతర రంగాలకు ప్రాధాన్యమిస్తామన్న మంత్రి.. నిరుపేదలకు వ్యాక్సిన్​ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.

సంతోషకరం..

రానున్న జనవరి కల్లా వ్యాక్సిన్​ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని స్థాయిల ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మన దగ్గర తయారు చేసిన వ్యాక్సిన్​ను ప్రపంచ మానవాళికి అందజేయటం సంతోషకరమని అన్నారు. వ్యాక్సిన్​ను తయారు చేస్తున్న భారత్​ బయోటెక్​ను ఇటీవలే ప్రధాని మోదీ సందర్శించారన్న మంత్రి.. త్వరలోనే 80 దేశాలకు చెందిన ప్రముఖులు హైదరాబాద్‌కు వచ్చి పరిశీలించనున్నారని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.