మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం పార్టీ కరీంనగర్ కార్పొరేషన్లో పాగా వేయాలని చూస్తోందని.. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు ఎంపీ బండి సంజయ్ కుమార్. జిల్లా కేంద్రంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో రెండు లక్షల సభ్యత్వ నమోదు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. పులువురు తెదేపా, వైకాపా నాయకులను భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 11న తన జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు కేకులు సన్మానాలు, సత్కారాలు వంటివి చేయవద్దన్నారు.
ఇవీ చూడండి: పంజాగుట్టలో వ్యాపారి మృతిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు