ETV Bharat / state

మిడ్ మానేరు నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు - protesr at midmaaneru

మిడ్ మనేర్ కుడి కాలువ పనులను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ - బండారుపల్లి వద్ద సమీప గ్రామస్థులు అడ్డుకున్నారు. వారి గ్రామాలకు వెళ్లడానికి కాలువపై బ్రిడ్జ్ నిర్మించిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Mid Maner right canal works were obstructed by nearby villagers at Rekonda-Bandarupalli in Chigurumadi zone of Karimnagar district
మిడ్ మానేరు నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు
author img

By

Published : Feb 27, 2021, 4:23 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ - బండారుపల్లి వద్ద మిడ్ మనేర్ కుడి కాలువ పనులను సమీప గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామాలకు వెళ్లడానికి కాలువపై బ్రిడ్జ్ నిర్మించిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమణ...

గ్రామస్థులు కాలువ నిర్మాణ పనులు అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న సైదాపూర్ సింగిల్ విండో ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి , తెరాస జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్థులు వినకపోవడంతో చివరకు ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు ఫోన్​లో సమస్య వివరించారు. బండారుపల్లి కెనాల్ వద్ద త్వరలోనే బ్రిడ్జి నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:పట్టపగలే న్యాయవాది దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.