కరీంనగర్‌లో ఇంటింటా తడి చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చేందుకు వీలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. వారం రోజులుగా నగరంలో తడి, పొడిచెత్తను వేరు చేసే విధానం పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. డంపింగ్ యార్డు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
ఈ అవగాహన ముగింపు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ శశాంకతో కలిసి మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతి పలు డివిజన్లలో పర్యటించారు. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను వేరు చేస్తే.. చెత్త ఎలా ఉపయోగపడుతుందో ప్రజలకు వివరించారు. చెత్త విషయంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను రీసైక్లింగ్ చేసి.. కంపోస్టు ఎరువుగా మార్చకపోతే డంపింగ్ యార్డు నిర్వహణ కూడా కష్టతరమౌతుందని మేయర్ సునీల్‌రావుతోపాటు కమిషనర్ క్రాంతి వివరించారు.
ఇదీ చూడండి: 'యువతకు వ్యవసాయంపై ఆసక్తి కలిగించేలా సర్కారు కృషి'