Road Accident in Karimnagar : ఎక్కడ చూసినా రహదారులపైనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ ఇసుక ట్రాక్టర్ అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదం కుటుంబం, గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాధకర ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జి సమీపంలో చోటుచేసుకుంది. ఈ నెల 3న (సోమవారం) రాత్రి రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
Three youngsters killed in road accident : ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరు ముగ్గురు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(26) అనే యువకులు. ఇసుక ట్రాక్టర్ అతి వేగమే ముగ్గురు యువకుల ప్రాణాలు బలి తీసుకొందని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఐదు వందల కూలీ కోసం ఇసుక ట్రాక్టర్ లోడ్ చేయడానికి వెళ్లిన ముగ్గురు యువకులు ఇసుక ట్రాక్టరే ఢీకొని చనిపోయారు. ముగ్గురు యువకుల మృతితో ఇటు గ్రామంలో, అటు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య మంగళవారం రాత్రి రామంచ గ్రామంలో యువకుల అంత్యక్రియలు జరిగాయి. అతివేగంతో ట్రాక్టర్ నడిపిన ట్రాక్టర్ డ్రైవర్ మైనర్ అని తెలుస్తోంది.
Massive Road Accident at Karimnagar : ట్రాక్టర్ను తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఉంచారు. రాత్రివేళ ఇసుక ట్రాక్టర్లను అనుభవం ఉన్న డ్రైవర్లతో నడిపిస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదని గ్రామస్థులు వాపోతున్నారు. ఏది ఏమైనా చేతికి అందివచ్చిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు యువకుల కుటుంబాలు కూడా కడుపేదరికంలో ఉన్న కుటుంబాలే కావడం గమనించదగ్గ విషయం.
Karimnagar Road Accident News : రేణిగుంట బ్రిడ్జి వద్ద మోయ తుమ్మల వాగులో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. గతంలో ఇప్పుడు జరిగిన ప్రమాదం స్థలంలో నాలుగు సార్లు ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ పోలీసులు జాప్యం చేస్తున్నారు. రోజువారీగా సుమారు 80 ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. విచక్షణ కోల్పోయి అతి వేగంగా రోడ్లపై ప్రయాణించడం, తప్పతాగి వాహనాలు నడపటం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తప్పక పాటించాలని వారు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: