ETV Bharat / state

మహా శివరాత్రికి సిద్ధమైన వేములవాడ ఆలయం.. డ్రోన్‌ విజువల్స్‌ ఇవిగో

Maha Shivaratri celebrations in Vemulawada: మహా శివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం సర్వం సిద్ధమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 3 నుంచి 4లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. డ్రోన్‌ కెమెరాలతో తీసిన ఆలయ విజువల్స్‌ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Maha Shivaratri celebrations in Vemulawada

author img

By

Published : Feb 17, 2023, 7:33 PM IST

మహా శివరాత్రికి సిద్ధమైన వేములవాడ ఆలయం.. డ్రోన్‌ విజువల్స్‌ ఇవిగో

Maha Shivaratri celebrations in Vemulawada: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. జాతర ఏర్పాట్లతో వేములవాడ పట్టణం నూతన శోభను సంతరించుకుంది. వేడుకలకు వచ్చే భక్తులకు దాదాపు రూ.3కోట్ల 30లక్షలతో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి వేములవాడలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా జరగనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

దాదాపు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో రాత్రి సమయంలో ఆలయ పరిసరాలు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. ధర్మగుండంలో కొత్త నీటిని నింపడమే కాకుండా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆలయం తగు ఏర్పాట్లు చేశారు. గుడి చెరువులో శివార్చన కార్యక్రమం చేయడానికి వేదిక సిద్ధ చేశారు. పార్కింగ్‌ స్థలం వైపు నుంచి ధర్మగుండానికి కొత్తగా గేట్లు పెట్టడమే కాకుండా.. జాతరకు 850 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను వివిధ డిపోల నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

Vemulawada Temple Drone Visuals: తిప్పాపూర్‌ నుంచి కట్ట కింద బస్టాప్‌ వరకు 14 ఉచిత బస్సులను ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో భక్తులు జాగరణ చేసేందుకు చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. పార్కింగ్‌ స్థలంలో తాత్కాలిక మరుగుదొడ్లు, జల్లు స్నానాలకు నల్లాలు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా మొబైల్‌ మూత్రశాలలను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.

క్యూలైన్లలోని భక్తులకు శుద్ధజలం, మజ్జిగ ప్యాకెట్లు అందించనున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్‌ దీపాలతో సుందరీకరించారు. డ్రోన్‌ కెమెరాలతో వీడియోలు తీసిన ఆలయ పరిసరాలు.. భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇవీ చదవండి:

మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన తెలంగాణ

వేములవాడలో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు

మహిళలకు నెలనెలా ఫ్రీగా రూ.500.. రైతులకు వడ్డీ లేని లోన్స్.. సీఎం గిఫ్ట్​!

'బీబీసీ లెక్కల్లో తేడాలు.. కీలక ఆధారాలు లభ్యం'.. ఐటీ శాఖ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.