ETV Bharat / state

వెల్​నెస్​ సెంటర్​లో నిలిచిపోయిన వైద్య సేవలు - welness center in karimnagar

పాత్రికేయులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన వెల్‌నెస్‌ సెంటర్‌లో ప్రస్తుతం సేవలు మృగ్యంగా మారాయి. కేంద్ర ప్రారంభంలో ఓ ప్రైవేటు రోగనిర్ధరణ కేంద్రంతో అనుసంధానమై పరీక్షలు పరీక్షలు నిర్వహించేవారు. గత రెండు నెలలుగా పరీక్షలను నిలిపివేయడం వల్ల వెల్‌నెస్‌ సెంటర్‌కు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

lot of problems in welness center in karimnagar district
వెల్​నెస్​ సెంటర్​లో నిలిచిపోయిన రోగ నిర్ధరణ పరీక్షలు
author img

By

Published : Jun 9, 2020, 5:42 PM IST

వెల్​నెస్​ సెంటర్​లో నిలిచిపోయిన రోగ నిర్ధరణ పరీక్షలు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు, పింఛనర్లు, పాత్రికేయులకు ఆరోగ్య పథకం కింద వైద్యసేవలు అందించడం కోసం కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో వెల్‌నెస్‌ కేంద్రాన్ని రెండేళ్ల క్రితం అప్పటి వైద్యశాఖమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. తొలి రోజుల్లో ఇక్కడ పూర్తిస్థాయి రోగ నిర్ధరణ పరీక్షలు, బ్రాండెడ్‌ కంపెనీల మందులతోపాటు దంత వైద్యం‌, ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులు, పాత్రికేయులు ఈ కేంద్రంలో వైద్యసేవలు పొందేవారు.

52 రకాల రోగ నిర్ధరణ పరీక్షలు

కానీ లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.లాక్‌డౌన్ కాలంలో ఒకరే వైద్యులు అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉన్నా స్పెషలిస్టులు ఎవరు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగికి వైద్యం చేయాలంటే రోగ నిర్ధరణ తప్పనిసరి. సాధారణ రక్త, మూత్రపరీక్షలతోపాటు..ఖరీదైన థైరాయిడ్‌, కాలేయం, కిడ్ని పనితీరు, లిక్విడ్‌ ప్రొఫైల్‌, కీళ్లవాతం, యూరిన్‌ ప్రొఫైల్‌ లాంటి ఖరీదైన రోగ నిర్ధరణ పరీక్షలతోపాటు.. 52 రకాల రోగ నిర్ధరణ పరీక్షలు, లూసీడ్‌ అనే ప్రైవేట్‌ రోగ నిర్ధారణ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకొని పూర్తిగా ఉచితంగా అందించేవారు. ప్రస్తుతం ఈ విధానానన్ని రద్దు చేశారు.

నమూనాలను సేకరించి సిద్దిపేట వైద్యకళాశాలకు

ప్రస్తుతం నమూనాలను సేకరించి సిద్దిపేట వైద్యకళాశాలకు పంపిస్తుండడం వల్ల ఆ ఫలితాలు తమ చేతికి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులుబీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థులు దీర్ఘకాలికంగా వాడే బీపీ, షుగర్‌మాత్రలతోపాటు రోగ నిర్ధరణ పరీక్షలు అందుబాటులో ఉంటాయని ఎంతో ఆశగా వస్తే తమకు సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇచ్చే జనరిక్‌ మందులు కాకుండా కేంద్రానికి వచ్చిన వారికి బ్రాండెడ్‌ కంపెనీల మందులు ఇచ్చేవారని ప్రస్తుతం కేవలం జలుబు, జ్వరం, మల్టీ విటమిన్‌ గోలీలు తప్ప అత్యవసర మందులు లభించడం లేదంటున్నారు.

తగ్గిపోయిన రోగులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 150మంది వరకు రోగులు వైద్యం కోసం వచ్చే వారని సరైన వైద్యసేవలు, రోగనిర్ధరణ పరీక్షలు లేకపోవడం వల్ల వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్‌లో సేవలు అధ్వాహ్నంగా మారాయి. కరోనా వేళ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో వైద్యులతోపాటు ఔషధాలు అందుబాటులోకి తీసుకొస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.