కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్కు తెర దింపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణ సముదాయాలను నిర్వహించుకోవడం కోసం అనుమతి ఇవ్వడంతో... ప్రజలు సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు తరలి వచ్చారు. సడలింపు సమయంలో నిత్యావసరాలు కొనుగోలు చేశారు.
మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో ఉదయం ఆరు గంటలకే మద్యం షాపులు తెరిచారు. ఈ క్రమంలో దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. అనంతరం దుకాణాలను, వ్యాపార సంస్థలను మూసివేశారు.
ఇదీ చూడండి: ఆ వ్యూహాల్ని తెలుసుకుని ఇక్కడ అమలుపరిస్తే..