కరీంనగర్ శివారులోని దిగువమానేరు జలాశయం నుంచి భారీగా నీటిని దిగువకు వదులుతున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఎల్‌ఎండీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మధ్యమానేరు ప్రాజెక్టుతో పాటు మోయతుమ్మెద వాగు నుంచి భారీగా వరద పోటెత్తుతోంది.
24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 23.60 టీఎంసీలకు చేరడం వల్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉదయం అన్ని గేట్లు ఎత్తి లక్షా 13వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలిపెడుతున్నారు.
ఇదీ చూడండి : రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి అరుదైన గౌరవం