కరీంనగర్లో సమయం దాటిన ఓ మద్యం దుకాణం వారు మద్యం అమ్మారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. 8 గంటల వరకు షాపులు మూసివేయాలని ముందస్తుగా సమాచారం ఇచ్చినా కరీంనగర్లోని మద్యం షాపు యజమానులు పెడచెవిన పెడుతున్నారు. నగరంలోని కోర్టు సమీపంలోని ఓ మద్యం దుకాణం వారు నిబంధనలు పాటించకుండా సమయం దాటిన మద్యం అమ్మారు.
పోలీస్ వాహనం సైరన్ వేసుకుని వస్తున్నా పట్టిపట్టనట్లు వ్యవహరించారు. ఎనిమిది గంటలకే మూసివేయాల్సినా మద్యం దుకాణాలు 8:30 గంటల వరకు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్