Land Grabs In Karimnagar : భూముల ధరలకు రెక్కలు రావడంతో కరీంనగర్‌లో ఇటీవల భూకబ్జాలు మితి మీరిపోయాయి. నగరపాలక పరిధిలో పది మంది కార్పొరేటర్లపై ముమ్మరంగా ఫిర్యాదులు వచ్చాయి. వీరికి గతంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పట్టించుకునే వారు కరువయ్యారని బాధితులు తెలిపారు. ఎన్నికల వేళ సీపీగా వచ్చిన అభిషేక్ మహంతి మాత్రం ఆయా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భూకబ్జాల కేసులో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు రాష్ట్రంలోని ప్రముఖ నాయకుల నీడలో బతుకు వెళ్లదీసిన వారే కావడం గమనార్హం.
CP Abhishek Investigation Land Grab : కరీంనగర్ జిల్లాలో ఓ భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన చీటి రామారావు మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడని ప్రచారంలో ఉంది. మరో నిందితుడిగా ఉన్న కార్పోరేటర్ తోట రాములు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడిగా ఉండేవారని స్థానికులు చెప్పుకుంటున్నారు. అయితే భూ దందాలకు సంబంధించిన వ్యవహారంలో కరీంనగర్ పోలీసులు మొదటి కేసులోనే ప్రముఖ నాయకులకు సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న సంకేతాలిచ్చారు కరీంనగర్ పోలీసులు.
పప్పు.. బెల్లం.. కబ్జాలకు లేదు కళ్లెం..
Land Grabs In Karimnagar : కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన కొత్త రాజిరెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమి విషయంలో కార్పోరేటర్ తోట రాములుతో పాటు చీటి రామారావు జోక్యం చేసుకుని తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదు చేసినా అప్పటి అధికారులు నిందితులపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించారని వెల్లడించారు.
Land Grabbing : నకిలీ సేల్ డీడ్లు.. డబుల్ రిజిస్ట్రేషన్లతో భూకబ్జాలు
Karimnagar CP Abhishek Mohanty : ఈ వ్యవహారంపై తమకు న్యాయం చేయాలంటూ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా అధికారులు పట్టించుకోలేదని రాజిరెడ్డి గతంలోనే మీడియా ముందుకు వచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని కలిసిన బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈనెల 31వరకు రిమాండ్‌కు తరలించారు.
The Economic Offenses Wing : ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వింగ్స్‌కు భిన్నంగా ఈ విభాగానికి కొత్త పేరు పెట్టారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు బదులుగా కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఈ వ్యవహారాలను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన బృందానికి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని పేరు పెట్టారు. అంటే కేవలం కబ్జాలు, నకిలీ డాక్యూమెంట్లు సృష్టించడం వంటి వ్యవహారాలే కాకుండా ఆర్థిక దందాలకు పాల్పడిన వారిపై కూడా కఠినంగా వ్యవహరించే ఉద్ధేశ్యంతోనే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్‌లోని పది మంది కార్పోరేటర్లపై ఫిర్యాదులు రాగా ఈ ప్రత్యేక బృందం వాటి గురించి లోతుగా విచారిస్తోంది.
ఆదిలాబాద్‌లో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల పంజా.. అధికారుల అండ..!
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కబ్జాలకు కాలు దువ్వుతున్న పార్టీ నేతలు