ETV Bharat / state

KTR Speech at Karimnagar BRS Meeting : 'అవసరమైతే.. TSPSCని ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం' - KTR Speech at Karimnagar BRS Meeting Today

KTR Speech at Karimnagar BRS Meeting Today : కరీంనగర్​లో పోటీ చేస్తే ఏమవుతుందో కాంగ్రెస్​, బీజేపీ నేతలకు తెలుసని మంత్రి కేటీఆర్​ అన్నారు. మోదీ చెప్పిన రూ.15 లక్షలు వచ్చినవారు బీజేపీకి.. రైతుబంధు వచ్చినవారు బీఆర్​ఎస్​కు ఓటు వేయాలని​ సూచించారు. రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని.. ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. అవసరమైతే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించారు.

BRS Praja Ashirvada Sabha at Karimnagar
Minister KTR Speech BRS Praja Ashirvada Sabha
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 1:34 PM IST

Updated : Oct 18, 2023, 2:13 PM IST

KTR Speech at Karimnagar BRS Meeting అవసరమైతే.. TSPSCని ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం

KTR Speech at Karimnagar BRS Meeting Today : గంగుల కమలాకర్​పై పోటీ అంటేనే.. అందరూ పారిపోతున్నారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్​లో పోటీ చేస్తే ఏమవుతుందో కాంగ్రెస్​, బీజేపీ నేతలకు తెలుసని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం(BRS Election Campaign)లో బిజీబిజీగా గడుపుతున్న కేటీఆర్​.. నేడు కరీంనగర్​లో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Meeting in Karimnagar)లో పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్​, బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​తో పాటు.. మంత్రి గంగుల కమలాకర్​, ప్రణాళిక కమిటీ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ హాజరయ్యారు.

KTR Election Campaign in Karimnagar : రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని.. ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగాలిచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అవసరమైతే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించారు. మోదీ చెప్పిన రూ.15 లక్షలు వచ్చినవారు బీజేపీకి.. రైతుబంధు వచ్చినవారు బీఆర్​ఎస్​కు ఓటు వేయాలని సూచించారు. కరీంనగర్‌ నుంచి గెలిచిన ఎంపీ బండి సంజయ్​.. ఈ ఐదేళ్లలో ఏదైనా పని చేశారా అని ప్రశ్నించారు. మోదీ ఎవరికి దేవుడో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్​ ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని.. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని స్పష్టం చేశారు. నిజమైన హిందువు ఎవరూ ఇతర మతాలపై దుమ్మెత్తిపోయరని వ్యాఖ్యానించారు.

BRS Incharges For 54 Constituencies : పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. 54 నియోజకవర్గాల ఇంఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం

"కొంతమంది చిల్లర రాజకీయం చేస్తున్నారు. ప్రవళ్లిక అనే అమ్మాయి హైదరాబాద్​లో మరణిస్తే.. ఆ యువతి మృతిని రాజకీయం చేశారు. ఈరోజు బాధిత కుటుంబం నా దగ్గరకు వచ్చారు. ఆ కుటుంబానికి బీఆర్​ఎస్​ ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఇచ్చాను. రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ, బీజేపీ నేతలు వస్తారు. జాబ్​ క్యాలెండర్​ ప్రకటిస్తాం.. తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్యోగులు విడుదల చేస్తాం. టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం." - కేటీఆర్​, మంత్రి

KTR Karimnagar Tour Updates : తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్​లోనే బీజం పడిందని.. కొత్త రాష్ట్రాన్ని రెండుసార్లు కేసీఆర్​ చేతుల్లో పెట్టారని కేటీఆర్ అన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలని ప్రజలకు సూచించారు. కరీంనగర్​లో ఎన్ని పనులు పూర్తి చేశామో చూడాలని కోరారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించామని.. ఇప్పుడు ఎక్కడు చూసినా జలకళే కనిపిస్తోందని తెలిపారు.

KTR On BRS Manifesto in Karimnagar : మళ్లీ అధికారంలోకి వచ్చాక పింఛను రూ.5 వేలు చేస్తామని.. వెయ్యి గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్​ఎస్​ పాలనలో పల్లెలు బాగుపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన తండాల్లో రోడ్లు వస్తున్నాయని... కరెంటు ఉంటోందని.. చదువుకుంటాననే పిల్లలకు రూ.20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నామని చెప్పారు. ఇతర పార్టీలకు ఓటేస్తే రాష్ట్రం వెనక్కి పోతుందని.. అభివృద్ధి అంటే పాఠశాలలు, ఆస్పత్రులు, కాలువలకు పునాదులు తీయాలని చెప్పారు.

ఏటా జాబ్​ క్యాలెండర్​ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను.. టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేసి మిగతా ఉద్యోగాలనూ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్​లో ప్రవళ్లిక మృతిని కూడా ఆఖరికి రాజకీయం చేశారని మండిపడ్డారు. యువతి కుటుంబ సభ్యులు తన దగ్గరకు వచ్చారని.. న్యాయం చేయాలని కోరారన్నారు. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

MLC Kavitha Fires on Rahul Gandhi : 'రాహుల్ మీరు ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు.. అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి'

KTR Fires on Congress and BJP : 'కేసీఆర్​ను తిడితే ఓట్లు రావు.. ఇది ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలి'

Last Updated : Oct 18, 2023, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.