ఐదేళ్లలో సంక్షేమ, అభివృద్ది రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుందని ఆయన వెల్లడించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే పింఛన్లు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 42 లక్షల మందికి రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఇస్తున్నామని.. రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో బాల్య వివాహాలు తగ్గాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:ఆరంభం అదుర్స్