ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ను గెలిపించిన ప్రజానీకానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy on Etela winning) ధన్యవాదాలు తెలియజేశారు. భాజపాను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని ప్రజలు నిరూపించారని కిషన్ రెడ్డి(Kishan reddy on Etela winning) అన్నారు. దిల్లీలో ఉన్న ఆయన.. ఈటల విజయం అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెరాస ప్రలోభాలకు లొంగకుండా హుజురాబాద్ ప్రజలు భాజపాను గెలిపించారు. ఈటలను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ఉపఎన్నికలో గెలుపు కోసం తెరాస అధిక మొత్తంలో డబ్బు వెదజల్లినా ప్రజలు భాజపానే గెలిపించారు. ఈ ఘనత నియోజకవర్గ ప్రజలకే దక్కుతుంది. నాయకునిపై అభిమానం ఉంటే ధనబలం పనిచేయదని హుజురాబాద్ ప్రజలు నిరూపించారు. అంతిమంగా ధర్మం, నిజాయతీ గెలిచింది. -కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
ఇది హుజూరాబాద్ ప్రజల విజయం అని కిషన్ రెడ్డి(Kishan reddy on Etela winning) పేర్కొన్నారు. ఈటల తర్వాత అంత ఎక్కువగా హుజూరాబాద్‌లో పర్యటించానని చెప్పారు. ఈ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనదన్న ఆయన.. అంతిమంగా ధర్మం, నిజాయతీ గెలిచిందని స్పష్టం చేశారు. నాయకుడిపై అభిమానం ఉంటే ధనబలం పనిచేయదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: LIVE UPDATES : హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల ఘన విజయం