రోజుకో సభలో పాల్గొనేలా షెడ్యూల్
ప్రతీ సభకు కనీసం రెండు లక్షల మంది హాజరయ్యేలా జనసమీకరణ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజుకు ఐదారు సభలు నిర్వహించిన కేసీఆర్... ఇప్పుడు రోజుకు ఒక్క సభలోనే పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏ రోజు ఎక్కడ సభలు ఉంటాయనే పూర్తి వివరాలు నేడో, రేపో తెలుపనున్నారు. సభల్లో కేసీఆర్ స్వయంగా అభ్యర్థులను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయి అంశాలు??
కరీంనగర్లో వినోద్ కుమార్, నిజామాబాద్లో కవిత పోటీ ఖరారైనందున.. ముందుగా ఆ రెండు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. జాతీయ స్థాయి రాజకీయ అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని.. అందుకే దిల్లీ సర్కారు మన చేతిలో ఉంటే వచ్చే ప్రయోజనాలు.. యూపీఏ, ఎన్డీఏ వైఫల్యాలు వివరించనున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన గంగుల