ETV Bharat / state

సంక్రాంతి సంబురం.. వేడుకగా కాటిరేవుల ఉత్సవం - చొప్పదండి నియోజకవర్గంలో ఘనంగా కాటిరేవుల పండుగ

సంక్రాంతి పండుగంటే కేవలం మనుషులకే కాదండోయ్‌. పశువులకు కూడా పవిత్రమైన పండగని చాటి చెబుతున్నారు కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ప్రజలు. వాటిని అందంగా అలంకరించి ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. ముస్తాబైన పాడి పశువులకు కాటిరేవుల ఉత్సవం ఘనంగా జరిపారు.

kati revula festival conducted in choppadandi constituency in karimnagar district
పశువులకు ఘనంగా కాటిరేవుల ఉత్సవం
author img

By

Published : Jan 14, 2021, 9:34 PM IST

kati revula festival conducted in choppadandi constituency in karimnagar district
పశువులకు ఘనంగా కాటిరేవుల ఉత్సవం

సంక్రాంతిని పాడిపంటలతో రైతులు సంతోషంగా గడుపుతారు. వారికి జీవనాధారమైన పశువులపై వారి మమకారం వెల కట్టలేనిది. వాటిని అందంగా అలంకరించి కాటిరేవుల ఉత్సవాన్ని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ గ్రామాల ప్రజలు ఘనంగా నిర్వహించారు.

పండుగ రోజున రైతులు తమ పాడి పశువులను ముస్తాబు చేసి పోటీ పడే వేదిక వద్దకు తీసుకొచ్చారు. సంప్రదాయక పద్ధతిలో పశువుల కాపరిని వాటి చుట్టూ పరిగెత్తించారు. ఈ ఉత్సవంలో చివరగా పాడి పశువులకు పరుగుపందెం పోటీలు నిర్వహిస్తారు. రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల్లో కాటి రేవుల పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.

ఇదీ చూడండి : సంక్రాంతి సంబురాలు... పొంగల్ తయారు చేసిన గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.