ETV Bharat / state

'సీఎం కేసీఆర్‌పై బొడిగె శోభ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం' - kanumalla vijaya angry over former mla bodige shobha

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కరీంనగర్ జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే శోభను జిల్లా నుంచి తరిమికొడతామని హెచ్చరించారు.

Karimnagar Zp chairpersonVijaya
Karimnagar Zp chairpersonVijaya
author img

By

Published : Apr 5, 2021, 10:59 AM IST

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కరీంనగర్ జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ ఖండించారు. శోభను సీఎం కేసీఆర్‌ తన కూతురిగా భావించి, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. ఈ విశ్వాసం లేకుండా శోభ వ్యక్తిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే కరీంనగర్ జిల్లా నుంచి బొడిగె శోభను తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విజయ హెచ్చరించారు. జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎలుక అనిత, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ట్రాఫిక్ పోలీసుల సరదా మీమ్.. నెట్టింట్లో తెగ వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.