ETV Bharat / state

బస్సుపాస్​ కౌంటర్​ ప్రారంభించిన కరీంనగర్​ ఆర్​ఎం

author img

By

Published : Nov 10, 2020, 10:37 PM IST

గత ఆరేళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ విభాగంలో కొనసాగుతన్న బస్సుపాసుల జారీ ప్రక్రియ ఆర్టీసీ ఉద్యోగులకు అప్పగించినట్లు కరీంనగర్ రీజనల్ మేనేజర్ జీవన్‌ప్రసాద్‌ తెలిపారు. కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సుపాసుల కౌంటర్‌ను ఆర్‌ఎం లాంఛనంగా ప్రారంభించారు.

బస్సుపాసు కౌంటర్​ ప్రారంభించిన కరీంనగర్​ ఆర్​ఎం

ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా 11చోట్ల బస్సుపాసుల జారీ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్​ఎం జీవన్​ ప్రసాద్​ తెలిపారు. కరీంనగర్‌-1,2డిపోలకు చెందిన కౌంటర్లు ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 32వేల ఉచిత పాసులతో పాటు 48వేల దివ్యాంగుల, 3లక్షల నెలవారీ పాసులు జారీ చేసేవారమని పేర్కొన్నారు. వాటి ద్వారా గతేడాది 3కోట్ల36లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని వివరించారు.

ఈ ఏడాది కరోనా కారణంగా ఉచిత పాసులు జారీ చేయలేదని... కేవలం 41,055 దివ్యాంగుల పాసుల జారీతో సంస్థకు6లక్షల36వేల రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు. గతంలో సెలవురోజుల్లో బస్‌పాస్‌ కౌంటర్‌ మూసి ఉండేదని... ఇకనుంచి ఉదయం8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆర్ఎం వివరించారు.

ఇదీ చూడండి: 'ఆ చట్టంలో లేనప్పుడు సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఎలా చేస్తారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.