కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ కాలువ నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రామడుగు మండలం తిర్మలాపూర్‌లో.. రైతులతో కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్ సమావేశమయ్యారు. కాలువ కోసం భూ సేకరణ విషయమై చర్చించారు.
భూములు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ప్రకటిస్తామని ఆర్డీవో వివరించారు. భూ రికార్డులు సిద్ధం చేసిన అనంతరం... ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎత్తిపోతల కాలువ కోసం స్థానిక లావాదేవీల మేరకు గరిష్ఠ ధర నిర్ణయించి రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు: లక్ష్మణ్