కరీంనగర్ జిల్లా మానేరు తీరంలోని నీటిశుద్ధి కేంద్రంలో తాగునీటి లభ్యతపై అధికారులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమీక్షించారు. మానేరు డ్యాంలో నాలుగు నెలలకు సరిపడా తాగునీరు ఉందని, ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నగరంలో తాగునీటి సమస్య నెలకొందని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఆ వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అక్టోబర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి రోజువారి తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో నగర పాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: చెన్నై దాహం తీర్చేందుకు ప్రత్యేక రైలు