కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు విజయవంతంగా సాగుతున్నాయని నగర పాలక మేయర్ యాదగిరి రావు అన్నారు. 52వ డివిజన్ ముకరంపురలోని సాయి కృష్ణ థియేటర్ వెనుక లైన్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న చోట్ల కాలనీ వాసులు సహకరించాలని కోరారు.
నగరంలో కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మేయర్ యాదగిరి రావు కోరారు. అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని హితవు పలికారు. నగరంలోని 60 డివిజన్లలో ప్రతిరోజూ హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజల శ్రేయస్సు కోసం తెరాస ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి : మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం