కరీంనగర్‌లోని 47వ డివిజన్లో మేయర్ సునీల్ రావు పర్యటించారు. వర్షాలతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను స్థానిక కార్పొరేటర్‌తో కలిసి పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు సంక్రమిస్తున్న తరుణంలో నగరంలోని ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
రోజూ కాలనీల్లో దోమల మందు చల్లుతున్నట్లు ఆయన వివరించారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్.. ఇక్కడ లేనిదంటూ ఏం లేదు!