ETV Bharat / state

ZYM OPENING: 'ప్రజారోగ్యం కోసమే జిమ్​ల నిర్మాణం' - జిమ్​ల ప్రారంభం

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ మేయర్ సునీల్​ రావు అన్నారు. నగరంలోని పలు కాలనీల్లో నిర్మించిన ఓపెన్​ జిమ్​లను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.

Karimnagar mayor sunil rao
Karimnagar mayor sunil rao
author img

By

Published : Jun 20, 2021, 6:10 PM IST

కొవిడ్​ సమయంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఓపెన్​ జిమ్​లు నిర్మిస్తున్నట్లు కరీంనగర్​ మేయర్​ సునీల్ రావు తెలిపారు. నగరంలోని పలు కాలనీల్లో నిర్మాణాలు పూర్తయిన వాటిని స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. నగరపాలక పరిధిలో 60 డివిజన్లు ఉండగా.. 30 చోట్ల రూ.3.60 కోట్లతో ఓపెన్ జిమ్​లు నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో పది పూర్తయ్యాయని మేయర్ స్పష్టం చేశారు.

నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామశాలల నిర్మాణం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. నగరంలోని సప్తగిరి, చైతన్యపురి కాలనీలు, కాశ్మీర్ గడ్డ, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, రమణారెడ్డిలతో ఆయన పాల్గొన్నారు. వ్యాయామశాలల్లో నాణ్యతతో కూడిన పరికరాలను బిగించాలని సూచించారు. ఈ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వ్యాయామశాలల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు ఐదేళ్లు వీటి నిర్వహణ చేపట్టాలని సునీల్​ రావు సూచించారు

ఇదీ చూడండి: TSRTC: అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్‌ఆర్‌టీసీ గ్రీన్ సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.