అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. నగరంలోని 26వ డివిజన్ కిసాన్‌నగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ నక్క పద్మతో కలిసి మేయర్ భూమి పూజ చేశారు.
నగర శివారు ప్రాంతాల్లోని కాలనీలను అభివృద్ధి చేస్తామని మేయర్ అన్నారు. పేదలు ఎక్కువగా నివసించే 34, 25, 26 డివిజన్ల పరిధిలోని కిసాన్‌నగర్, కార్ఖానా గడ్డ ఏరియాలో మౌలిక వసతులతో కూడిన పనులను చేపడుతున్నామని ఆయన చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా నగరంలోని ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు
ఇదీ చదవండి: Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..