కరీంనగర్ డివిజన్లలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తిన నగరపాలక సంస్థ ఆద్వర్యంలో పరిష్కరిస్తామని నగర మేయర్ సునీల్ రావు తెలిపారు. నాలుగో రోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ 42వ డివిజన్‌లో పర్యటించారు. కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావుతో కలిసి పాదయాత్ర చేశారు.
డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, శ్మశానవాటికలోని పలు సమస్యలను కార్పొరేటర్ మేయర్ సునీల్ దృష్టికి తెచ్చారు. మేయర్ సునీల్ రావు డ్రైనేజీ సమస్యలను పరిశీలించి అనంతరం శ్మశాన వాటికను సందర్శించారు. శ్మశాన వాటికలో ఉన్న ప్రహరిగోడ నిర్మాణం, గేటు తదితర సమస్యలను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పారిశుద్ధ్య పనుల నేపథ్యంలో డివిజన్‌లోని డ్రైనేజీలలో ఉన్న సిల్టును కార్మికులతో తొలగించి వేశారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా ఫాగింగ్ చేయించడం, స్ప్రే చల్లడం లాంటి పనులు చేయించారు. కార్పొరేటర్ తమ దృష్టికి తెచ్చిన సమస్యలను వారం రోజుల్లో పూర్తి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. వర్షాకాలంలో పరిసరాలను శుభ్రం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్