కరీంనగర్‌లోని ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఆవరణలో పాదచారుల కోసం నడకదారికి మేయర్ సునీల్‌రావు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో 60 డివిజన్లలో వ్యాయామశాలలతో పాటు సైకిల్ ట్రాక్‌లను నిర్మిస్తామని ఆయన అన్నారు.
అనంతరం సప్తగిరి కాలనీలో నగరపాలక సంస్థ వాహనాల పార్కింగ్ కోసం భూమిపూజ నిర్వహించారు. ప్రజల మేలు కోసం నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మేయర్ తెలిపారు.