కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 30న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తుది నిర్మాణ పనులను... అధికారులతో కలిసి పరిశీలించారు. ఐటీ అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు.
దాదాపు 3000 మంది యువతకు... ఐటీ టవర్‌లో ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో... సీఎం కేసీఆర్ కరీంనగర్‌కి ఐటీ టవర్ కేటాయించారని మంత్రి గంగుల పేర్కొన్నారు. ఇప్పటికే 11 కంపెనీలతో ఎంవోయూలు పూర్తికాగా... మరిన్ని కంపెనీలు ఉత్సాహం చూపెడుతున్నారన్నారు మంత్రి గంగుల.
ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త