ETV Bharat / state

'మా పొలాలకు నీళ్లివ్వని కాలువలకు మేం భూములివ్వం' - తెలంగాణ వార్తలు 2021

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపురంలో మోతే కాలువ లైన్ సర్వేను రైతులు అడ్డుకున్నారు. తమ పంటకు నీరందించని కాలువ నిర్మాణం అవసరం లేదని వ్యతిరేకించారు.

karimnagar farmers intercepted mothe canal survey at ramachandrapuram
కాలువల సర్వేను అడ్డుకున్న రైతులు
author img

By

Published : Feb 4, 2021, 1:13 PM IST

తమ పంట పొలాలకు సాగునీరు అందించని కాలువల నిర్మాణం చేపట్టొద్దని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపురం రైతులు నిరసన వ్యక్తం చేశారు. మోతే కాలువల లైన్ సర్వేను అడ్డుకున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్, ఎస్సారెస్పీ వరద కాలువ, గాయత్రి గ్రావిటీ కాలువలకు భూమి ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తమ భూముల్లో సర్వే చేపట్టిన కొత్త కాలువల ద్వారా కూడా.. తమ పొలాలకు నీరు పారదని వాపోయారు. సర్వే చేస్తున్న సిబ్బందిని, కాంట్రాక్టర్​ను అడ్డుకుని అక్కణ్నుంచి పంపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.