ETV Bharat / state

KARIMNAGAR CP: 'రాత్రి వేళల్లో యువత రోడ్లపైకి రాకుండా చర్యలు'

కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కరీంనగర్​ సీపీ సత్యనారాయణ సూచించారు. మాస్క్​ ధరించనివారిపై రోజుకు 500 కేసులు నమోదుచేస్తున్నట్లు తెలిపారు.

karimnagar cp satyanarayana
karimnagar cp satyanarayana
author img

By

Published : Aug 19, 2021, 7:24 PM IST

ప్రతి ఒక్కరూ కొవిడ్​ ప్రోటోకాల్​ పాటించాలని కరీంనగర్​ పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివిటి రేటు తక్కువగానే ఉన్నా.. నిబంధనలు పాటించాలని సూచించారు. థర్డ్​ వేవ్​ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామన్న సీపీ.. అందులో భాగంగానే రోజు మాస్క్​ ధరించని సుమారు 500 మందిపై కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు.

కరీంనగర్​లోని రెండో పట్టణ స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ.. పౌరులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. నగరంలోని ట్రాఫిక్​ సమస్య పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. రాత్రి వేళల్లో యువత రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.

'ప్రస్తుతం కరీంనగర్​లో కరోనా పాజిటివిటీ రేటు 1.23గా ఉంది. ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. థర్డ్​వేవ్​ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు. మాస్క్​లు అందరూ ధరించాల్సిందే. మాస్క్​లు ధరించనివారిపై రోజుకు సుమారు 500 కేసులు నమోదుచేస్తున్నాం.'

- సత్యనారాయణ, కరీంనగర్​ సీపీ

ఇదీచూడండి: Minister KTR: త్వరలో ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్ట్.. ముందుగా ఆ రెండు జిల్లాల్లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.