ETV Bharat / state

'పల్లె ప్రగతిలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలి' - పల్లె ప్రగతిపై కరీంనగర్​ జిల్లా కలెక్టర్  శశాంక అవగాహన కార్యక్రమం

కరీంనగర్​ జిల్లాలోని  అన్ని గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో అభివృద్ది చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్  శశాంక అన్నారు. కలెక్టరేట్​ ఆడిటోరియంలో పల్లె ప్రగతి రెండో విడత సన్నాహక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

karimnagar collector shashanka awareness meeting on palle pragathi program
'పల్లె ప్రగతిలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలి'
author img

By

Published : Dec 28, 2019, 2:01 PM IST

'పల్లె ప్రగతిలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలి'

పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందర్నీ భాగస్వామ్యులు చేయాలని కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక అన్నారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మించాలని అధికారులకు సూచించారు.

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్​ తెలిపారు. మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టి పూర్తి చేసిన పనులన్నీని రెండో విడతలో ప్రజలకు తెలపాలని సూచించారు.

ప్రతి రోజు కార్యక్రమాలను రిజిస్టర్​లో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. గ్రామాల్లో ఉపయోగంలో లేని బోర్ వెల్స్, ఓపెన్ వెల్స్​ను పూడ్చివేయించాలని సూచించారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో.. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులందరు పోటీపడుతూ పల్లెల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Intro:TG_KRN_08_28_COLLECTER_ON_PALLEPRAGATHI_TS10036
Sudhakar contributer karimnagr

గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా అభివృద్ది చేయాలి:

జిల్లాలోని అన్ని గ్రామాలను పరి శుభ్రంగా, పచ్చదనంగా అభివృద్ది చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.కలెక్టరేటు ఆడిటోరియం లో పల్లె ప్రగతి రెండవ విడుత సన్నాహక అవగాహన కార్యక్రామానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. మొదటి విడుత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలలో విజయవంతం అయినదని, అదే స్ఫూర్తి తో రెండవ విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. గ్రామాలకు అధికారులు వెళ్లగానే పరిశుభ్రత, పచ్చదనంతో స్వాగతం పలికేలా గ్రామాలను తీర్చిదిద్దలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రజలందరిని భాగస్వామ్యులు చేయాలని సూచించారు. ప్రతి గ్రామం లో పారిశుద్ద్యం, హరితహారం, వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు నిర్మించాలని అన్నారు. పై పనులు అన్ని సాధించాలంటే ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. రెండవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించి ఒకే రోజు గ్రామం మొత్తానికి ముగ్గులు పోసి పనులు ప్రారంభించాలని అన్నారు. ఇంకుడు గుంతల ద్వారా 80 శాతం ఇంటి నుండి వృధా పోయే నీరు ఇంకుడు గుంతలోకి వెళ్లి భూగర్బ జలాలు పెరుగుటయే కాకుండా పరిశుభ్రత దెబ్బతినకుండా కాపాడుతాయని అన్నారు. ప్రతి గ్రామం లో 5-6 కమ్యూనిటి సోపిట్స్ నిర్మించాలని ప్రతి గ్రామ పంచాయితీలో బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. చెత్త సేకరణకు రెండు చెత్తబుట్టలను ఇంటింటికి పంపింణి చేయాలని సూచించారు. ఇండ్ల నుండి చెత్తను రిక్షాల ద్వారా సేకరించి, ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డులకు తరలించాలని ప్రతి గ్రామం లో నర్సరీలను పెంచాలని, నర్సరీలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. భూమి ఉన్న ప్రతి గ్రామం లో డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు నిర్మించాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయితి భవనానికి పెయింటింగ్ వేయించాలని ఆదేశించారు. మొదటి విడుత పల్లె ప్రగతి కార్యక్రమం లో చేపట్టి పూర్తి చేసిన పనులన్నిటిని రెండవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రజలకు తెలుపాలని సూచించారు. పండుగ వాతావరణం లో రెండవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి రోజు కార్యక్రామాలను రిజిష్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఉపయోగం లోని బోర్ వెల్స్, ఓపెన్ వెల్స్ పూడ్చివేయించాలని అన్నారు. ప్రధాన రహదారికి రోడ్డు ప్రక్కన గల ప్రధానకరమైన భావులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం లో చేపట్టిన పనులన్నిటికి పంచాయితి రాజ్ ఇంజనీర్లు బిల్ రికార్డింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణపై మండల స్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు. రెండవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్నిగ్రామ, మండల , జిల్లా స్థాయి అధికారులందరు పోటీ తత్వంతో పల్లెల సమగ్రాభివృద్దికి కృషి చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ది కి ఆర్థిక సహాయం అందించే ధాతల వివరాలను సేకరించాలని అన్నారు.

         Body:YyConclusion:Hh
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.